ఆమంచి, దగ్గుబాటిని పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్‌ జగన్


JMRTVLIVE అమరావతి: చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అధికారికంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేసి ఇటీవల వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసిన ఆమంచి బుధవారం పార్టీలో చేరారు. ఈమేరకు వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ఆమంచితో పాటు సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్‌ కూడా పార్టీలో చేరారు. వైఎస్‌ జగన్‌ ఆయనను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

కాగా తాడేపల్లిలోని పార్టీ నూతన కార్యాలయం ప్రారభోత్సవం సందర్భంగా వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న వైఎస్‌ జగన్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. (తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ గృహ ప్రవేశం)

admin