ఆమదాలవలస మండలం తూర్పుకాపు సంక్షేమ సంఘం మండల కమిటీ ఎన్నిక. 27.2.2019 బుధవారం( ఆమదాలవలస మండలం ,శ్రీకాకుళం జిల్లా న్యూస్) :

ఆమదాలవలస మండలం తూర్పుకాపు సంక్షేమ సంఘం మండల కమిటీ ఎన్నిక.

27.2.2019 బుధవారం( ఆమదాలవలస మండలం ,శ్రీకాకుళం జిల్లా న్యూస్) :

ఆంద్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో సమావేశం ఏర్పాటు చేసి మండల కమిటీ వేయడం జరింది.మండల అధ్యాక్షునిగా కోరుకొండ రమణమూర్తి,ఉపాధ్యక్షులుగా మామిడి డిల్లేశ్వరరావు, గొర్లె సత్యం,ప్రధానకార్యదర్శి సైలాడా దాసు నాయుడు,కార్యదర్శి వండాన శ్రీరామమూర్తి, కోశాధికారి సోమరాజు ప్రసాద్ , 40 మంది కార్యవర్గ సభ్యులతో కమిటీ వేయడం జరిగింది. చంద్రమోహన్ మాట్లాడుతూ తూర్పు కాపులను బీసీ.డి నుండి బీసీ.ఎ లోనికి చేర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండు చేసారు.ఉత్తరాంధ్ర మినహా10 జిల్లాల్లో నివచిస్తున్న వలస తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికేట్ లను మంజూరు చేయాలని ప్రభుత్వాలను కోరారు.ఆంద్రప్రదేశ్ తూర్పుకాపు కార్పొరేషన్ ద్వారా యువతకు వృత్తి విద్యా నైపుణ్యాన్నిచ్చి , ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలును కల్పిచాలని,వెనుకబడిన తూర్పు కాపు కుటుంబాలకు కార్పొరేషన్ ద్వారా 50 ఏళ్లకే నెలవారీ పెంక్షన్లను మంజూరు చేయాలన్నారు. ప్రతి జిల్లాల్లో తూర్పు కాపులకు సామాజిక భవనాలును నిర్మించాలి,3000 వేల జనాభా కలిగిన గ్రామాలిలో ప్రియమారి హెల్త్ సెంటర్లు , గ్రంధాలయాలను నిర్మించాలని , తూర్పుకాపులున్న ప్రతి మండలానికి 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను నిర్మించాలని,తూర్పు కాపు కార్పొరేషన్ కు జనాభా దామాషా పద్దతిలో సుమారు 2000 వేల కోట్ల రూపాయలును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కరిమజ్జి మల్లేశ్వరరావు, రాష్ట ఉపాధ్యక్షుడు కొత్తకోట్ల సింహాద్రినాయుడు, జిల్లా నాయకులు వండాన ఉదయ్ కుమార్,వావిలపల్లి శ్రీనివాస్ రావు,మామిడి చిన్నారవు,చేపాన రాంబాబు,పైల హేమసుందరరావు తదితరులు పాల్గొన్నారు.

admin