బిగ్ బ్రేకింగ్ న్యూస్: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన..

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలు విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. మొదట లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్‌ ప్రకటించారు. ఆ తర్వాత 175 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను సీనియర్‌ నేత ధర్మాన ప్రకటించారు.
(చదవండి : వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..!)
ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసే 9 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేయగా.. మిగతా అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్‌ ప్రకటించారు. ఇక విశాఖ జిల్లా నర్సీపట్నంలో 12.30 గంటలకు ఎన్నికల తొలి బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ బహిరంగ సభ, సాయంత్రం 4.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట బహిరంగ సభల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.

జిల్లాల వారీగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా..
#శ్రీకాకుళం:-
ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌
పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
టెక్కలి- పేరాడ తిలక్‌
పాతపట్నం-రెడ్డిశాంతి
శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస- తమ్మినేని సీతారం
ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌
నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌
రాజాం (ఎస్సీ)- కంబాల జోగులు
పాలకొండ(ఎస్టీ) -వీ.కళావతి

#విజయనగరం:-
కురుపాం(ఎస్సీ)- పాముల పుష్పవాణి
పార్వతీపురం(ఎస్సీ)- ఎ జోగరాజు
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య
ఎస్‌ కోట- కే శ్రీనివాసరావు
బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు
సాలూరు(ఎస్సీ)-పీడిక రాజన్నదొర
నెల్లిమర్ల-బీ అప్పల నాయుడు
విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి
శృంగవరపు కోట- కే శ్రీనివాస్‌

#విశాఖపట్నం :-
విశాఖ ఈస్ట్‌-మళ్లా విజయ్‌ ప్రసాద్‌
విశాఖ సౌత్‌-ద్రోణం రాజు శ్రీనివాస్‌
విశాఖ వెస్ట్‌-డాక్టర్‌ పీవీ రమణమూర్తి
విశాఖనార్త్‌-కమ్మిల కన్నపరాజు
అరకు(ఎస్టీ)-శెట్టి ఫాల్గుణ
పాడేరు(ఎస్సీ)-భాగ్యలక్ష్మి
పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌
గాజువాక-తిప్పల నాగిరెడ్డి
అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్‌
యలమంచిలి-యువీ. రమణమూర్తి రాజు
పాయకరావుపేట(ఎస్సీ)- గొల్ల బాబురావు
నర్సీపట్నం- పీ. ఉమశంకర్‌ గణేష్‌
చోడవరం-కరణం ధర్మశ్రీ
మడుగుల-బి. ముత్యాల నాయుడు
భీమిలి-అవంతి శ్రీనివాస్‌

#తూర్పుగోదావరి:-
తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా)
ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌
పిఠాపురం- పెండెం దొరబాబు
కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు
పెద్దాపురం- తోట వాణి
అనపర్తి- ఎస్‌. సూర్యనారాయణ రెడ్డి
కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి
రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
అమలాపురం(ఎస్సీ)- పి. విశ్వరూప్‌
రాజోలు(ఎస్సీ)- బొంతు రాజేశ్వర్‌ రావు
గన్నవరం(ఎస్సీ)- కొండేటి చిట్టిబాబు
కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి
మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌
రాజానగరం- జక్కంపుడి రాజా
రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌ రావు
రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు
జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం(ఎస్టీ)- నాగులపల్లి ధనలక్ష్మి

పశ్చిమగోదావరి
కొవ్వురు(ఎస్సీ)- తానేటి వనిత
నిడదవోలు- జి. శ్రీనివాస నాయుడు
ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు
పాలకొల్లు- డాక్టర్‌ బాబ్జీ
నరసాపురం- ముదునురి ప్రసాద్‌ రాజు
భీమవరం- గ్రంథి శ్రీనివాస్‌
ఉండి- పీవీఎల్‌ నరసింహరాజు
తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ
ఉంగుటురు- పుప్పాల శ్రీనివాసరావు
దెందులురు- కొఠారు అబ్బాయి చౌదరి
ఏలురు- కృష్ణ శ్రీనివాసరావు
గోపాలపురం(ఎస్సీ)- తలారి వెంకట్రావు
పోలవరం(ఎస్టీ)- తెల్లం బాలరాజు
చింతపుడి(ఎస్సీ)- వి.ఆర్‌.ఇలియజ్‌

#కృష్ణా జిల్లా..
తిరువూరు (ఎస్సీ)-కొక్కిలగడ్డ రక్షణనిధి
గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ-కొడాలి వెంకటేశ్వరరావు (నాని)

కైకలూరు-దూలం నాగేశ్వరరావు
పెడన-జోగి రమేష్‌
మచిలీపట్నం-పేర్ని వెంకట్రామయ్య (నాని)
అవనిగడ్డ-సిహాంద్రి రమేష్‌బాబు
పామర్రు (ఎస్సీ)-కైలే అనిల్‌కుమార్‌
పెనమలూరు-కొలుసు పార్థసారథి

విజయవాడ వెస్ట్‌-వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడ సెంట్రల్‌-మల్లాది విష్ణు
విజయవాడ ఈస్ట్‌-బొప్పన బావ్‌కుమార్‌
మైలవరం-వసంత కృష్ణ ప్రసాద్‌
నందిగామ (ఎస్సీ)-డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు
జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను
నూజివీడు-మేక వెంకటప్రతాప్‌ అప్పారావు

#గుంటూరు జిల్లా..
పెదకూరపాడు-నంబూరి శంకరరావు
తాడికొండ (ఎస్సీ)-ఉండవల్లి శ్రీదేవి
మంగళగిరి-ఆళ్ల రామకృష్ణరెడ్డి
పొన్నూరు-కిలారి రోషయ్య
వేమూరు (ఎస్సీ)-మేరుగ నాగార్జున
రేపెల్ల-మోపిదేవి వెంకటరమణరావు
తెనాలి-అన్నాబత్తుని శివకుమార్‌

బాపట్ల-కోన రఘుపతి
ప్రత్తిపాడు (ఎస్సీ)-మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్‌-చంద్రగిరి యేసురత్నం
గుంటూరు ఈస్ట్‌-షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా
చిలకలూరిపేట-విడదల రజని

నరసరావుపేట-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి-అంబటి రాంబాబు
వినుకొండ-బొల్లా బ్రహ్మనాయుడు
గురజాల-కాసు మహేష్‌రెడ్డి
మాచర్ల-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

#ప్రకాశం జిల్లా..
ఎర్రగొండపాలెం (ఎస్సీ)-డాక్టర్‌ ఆదిమూలపు సురష్‌
దర్శి-మద్దిశెట్టి వేణుగోపాల్‌
పరచూరు-దగ్గుబాటి వెంకటేశ్వరరావు
అద్దంకి-బచ్చన చెంచు గరటయ్య
చీరాల-ఆమంచి కృష్ణమోహన్‌
సంతనూతలపాడు (ఎస్సీ)-టీజేఆర్‌ సుధాకర్‌బాబు
ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి

కందుకూరు-మానుగుంట మహిధర్‌రెడ్డి
కొండపి(ఎస్సీ)-డాక్టర్‌ ఎం.వెంకయ్య
మార్కాపురం-కేపీ నాగార్జున రెడ్డి
గిద్దలూరు-అన్నా వెంకట రాంబాబు
కనిగిరి-బుర్రా మధుసూధన్‌ యాదవ్‌

#నెల్లూరు జిల్లా..
కావలి-రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి
ఆత్మకూరు-మేకపాటి గౌతమ్‌కుమార్‌ రెడ్డి
కోవూరు-నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి
నెల్లూరు సిటీ-పోలుబోయిన అనిల్‌కుమార్‌
నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

సర్వేపల్లి-కాకాని గోవర్ధన్‌రెడ్డి
గూడూరు (ఎస్సీ)-వరప్రసాద్‌
సూళ్లూరుపేట (ఎస్సీ)-కిలివేటి సంజీవయ్య
వెంకటగిరి-ఆనం రామనారాయణరెడ్డి
ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

admin