‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’పై హైకోర్టు విచారణ….!!!

అమరావతి : రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విడుదల పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. సినిమా విడుదలపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించవల్సిందిగా ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే సినిమా విడుదలవుతుందని ఆంధ్రా ప్రేక్షకులు భావించారు. కానీ ఎన్నికలు పూర్తయి నాలుగు రోజులు కావస్తున్నా సినిమా విడుదలపై క్లారిటీ రావటం లేదు.

అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్‌పై హైకోర్టు స్టే విధించటంతో అప్పటినుంచి చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పి.మోహన్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

admin