శ్రీకాకుళంలో పేలిన నాటు బాంబులు…!!!

శ్రీకాకుళం: ఓ ఇంట్లో దాచి ఉంచిన ముందుగుండు సామాగ్రి పేలడం జిల్లాలో కలకలం రేపింది. లక్ష్మీ టాకీస్‌ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి జనావాసాలు మధ్య ఉన్న ఇళ్లు కుప్పకూలింది. పరిసరాల్లోని మరో నాలుగైదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాటు బాంబులు తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అడవి పందులను వేటాడం కోసం ఆ ఇంట్లో ఉంటున్నవారు ఈ బాంబులు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఇంట్లో నివసిస్తున్నవారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున నాటు బాంబుల తయారీ జరుగుతున్న అధికారులు గుర్తించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Y Vasu Naidu, JMRTVLIVE AMARAVATHI, AP POLITICAL BUREAU.

admin