ఆంధ్ర ప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌!!!

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోని రాబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీ అధిక స్థానాలు గెలుచుకుటుందని జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ తేట తెల్లం చేశాయి. వైఎస్సార్‌సీపీకి గరిష్టంగా 24 ఎంపీ సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని అత్యధిక శాతం ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో జనం వైఎస్‌ జగన్‌వైపు మొగ్గు చూపారు. జగన్‌ను సీఎంగా చూడాలని 45 శాతం మంది ఆకాంక్షించారు. చంద్రబాబు కావాలని 40 శాతం మంది అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నవారు కేవలం 13 శాతం మాత్రమే. ప్రజల అభీష్టం మేరకే ఎన్నికలు ఫలితాలు ఉంటాయని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

By Y Vasu Naidu JMRTVLIVE AMARAVATHI AP POLITICAL BUREAU.

admin