ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు!! వైఎస్‍ఆర్‌సీపీ ప్రభంజనం…..

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని వెల్లడించాయి. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది.

►లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. టీడీపీ​కి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.

► ఆరా సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.

► టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా.

►న్యూస్‌ 18- ఐపీఎస్‌ఓఎస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో…
►ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 130 నుంచి 133 వరకు సీట్లు వస్తాయని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) అంచనా వేసింది. టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి సున్నా నుంచి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.

►వైఎస్సార్‌సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్‌ పల్స్‌ సర్వే వెల్లడించింది. వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 21 లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.

►ఆరా సర్వేలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.

►ఇండియా టుడే- యాక్సిస్‌ మై నేషన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 130 నుంచి 135 సీట్లు వస్తాయి. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కనున్నాయి. జనసేనకు ఒకటి రావొచ్చు.

►వీడీపీఏ అసోసియేట్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.

By Y Vasu Naidu JMRTVLIVE AMARAVATHI AP POLITICAL BUREAU.

admin