పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం!!!!

హైదరాబాద్‌: పీపుల్‌ పల్స్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 112 సీట్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించవచ్చని సర్వే ద్వారా అంచనా వేసింది. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ 59 స్థానాల్లో గెలుపొందే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించవచ్చునని పేర్కొంది. అలాగే వైఎస్సార్‌సీపీ 18 నుంచి 21 స్థానాలు గెలిచే అవకాశముందని, టీడీపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని చెప్పింది.

వైఎస్సార్‌సీపీకి 45.4 శాతం ఓట్లు, టీడీపీకి 42.3 శాతం, జనసేనకు 8.4 శాతం, ఇతరులకు 3.9 శాతం ఓట్లు రావచ్చునని వెల్లడించింది. వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ ఖాతా తెరవక పోవచ్చునని, అలాగే జనసేనకు 10 జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాకపోవచ్చునని సర్వే ద్వారా చెప్పింది. జనసేనకు పశ్చిమ గోదావరిలో రెండు, తూర్పుగోదావరి, విశాఖపట్నంలో ఒక్కో సీటు గెలిచే అవకాశముందన్నారు.

BY Y Vasu Naidu JMRTVLIVE AMARAVATHI AP POLITICAL BUREAU.

admin