వంగర కేజీబీవి స్పెషల్ ఆఫీసర్ కు సన్మానం.!!!

శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం: వంగర కస్తూరిబాగాంధీ విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ బి.రోహిణి కు ఘనంగా సన్మానం చేశారు. స్థానిక విద్యాలయంలో ఇటీవల పదో తరగతి ఫలితాలు సంబంధించి శతశాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు మంచి గ్రేడ్ పాయింట్లు సాధనకు కృషి చేసిన స్పెషల్ ఆఫీసర్ బి.రోహిణి కు శ్రీకాకుళం లో శనివారం జీ సీ డీ వో ఎస్ సత్యవతి, ఏ ఎం వో ఏ సంజీవరావు, ఎస్ ఏ వో నర్సింహ రావు, తదితర జిల్లా అధికారులు జ్ఞాపికలు ఇచ్చి శాలువాతో సత్కరించారు.31 మంది విద్యార్ధులకు గాను వీరిలో 10/10 9మందికి, 9.8 ముగ్గురు, 9.7 ఒక్కరూ, 9.5- 6 ఆరుగురు, 9.3- ఒక్కరూ, 9.2- నలుగురు, 9.0 ఒక్కరూ, 8.8 ఒక్కరూ, 8.7 ఒక్కరూ, 8.5 ఇద్దరు, 8.2 ఇద్దరు పదో తరగతిలో తమ తమ ప్రతిభను కనబర్చారు.

By JMRTVLIVE AMARAVATHI AP POLITICAL BUREAU.

Y VASU NAIDU.

admin