విద్యార్థుల భవిష్యత్‌ కోసమే ఇంగ్లీష్‌ మీడియం

వైయస్‌ఆర్‌ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని,  విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్‌ మీడియం లేక బయట ప్రదేశాలకు వెళ్తున్నారని,ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టి సీఎం వైయస్‌ జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఆంగ్ల భాష తప్పనిసరి అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

నాణ్యమైన విద్యనందించడమే ధ్యేయం: 
నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభిస్తామని, జనవరి నుంచి మే నెల వరకు టీచర్లకు ఆంగ్ల భాషపై శిక్షణ ఇస్తామన్నారు. ఆంగ్ల భాష నైపుణ్యాలను పిల్లలకు అందిస్తే..అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు.

admin