ప్రతిభకు పేదరికం అడ్డుకారాదు- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసన సభాపతి తమ్మినేని సీతారాం!!!!

ప్రతిభకు పేదరికం అడ్డుకారాదు- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసన సభాపతి తమ్మినేని సీతారాం:
శ్రీకాకుళం నవంబర్11,2019:

ప్రతిభకు పేదరికం అడ్డుకారాదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.శ్రీకాకుళం టౌన్ ఆనందమయి కన్వెన్షన్ హాల్లో జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ వేడుకలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసన సభాపతి తమ్మినేని సీతారాం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.సంగీత ఉపాధ్యాయులు ప్రశాంతి ప్రార్దనగీతాన్ని ఆలపించారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా డా||ఎ.పి. జె.అబ్దుల్ కలాం విద్యా పురస్కార అవార్డులను ( ప్రతిభా పురస్కారాలు) 10వ తరగతి, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ , డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యూవెట్ లలో మంచి మార్కులుతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణులైన 224 మంది విద్యార్థులు,46 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 32మంది పాలిటెక్నిక్ విద్యార్థులు, 23మంది డిగ్రీ విద్యార్థులు, 16 మంది పోస్ట్ గ్రాడ్యూవెట్
విద్యార్థులుకు పురస్కారాలు ప్రదానం చేశారు.

పురస్కారాలు అందుకున్న వంగర కేజిబివి విద్యాకుసుమాలు, ప్రతిభావంతులు.

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో శ్రీకాకుళం టౌన్ ఆనందమయి కన్వెన్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభా పురస్కారాలుకు ఎంపికయిన వంగర మండల కేజిబివి విద్యాకుసుమాలు, ప్రతిభావంతులుకు నగదు బహుమతి, ప్రసంశా పత్రాలు సతిపిడకల ఝాన్సీ, టి.అనూష, సాయిలక్ష్మీ, వంగర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎన్.పవిత్ర మద్దివలససీతారాంపురం ఉన్నత పాఠశాల నుంచి యూ.లలిత శ్రీ, కొనంగి పాడు విద్యార్దిని గుడివాడ దుర్గ వీరుఅందరూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ జె.నివాస్, డీ. ఈ. ఓ చంద్రకళ చేతులు మీదుగా పురస్కారాలు అందుకున్నారు.పురస్కారాలు అందుకున్న విద్యార్దిని విద్యార్దులుకు ఎం. ఈ. ఓ దుర్గారావు,కేజిబివి స్పెషల్ ఆఫీసర్ బి.రోహిణి, ఉన్నత పాఠశాల లు ప్రధానోపాధ్యాయులు,తదితర బోధనా సిబ్బంది ఆశీర్వాదం తెలియజేసి అభినందించారు….
By Y Vasu Naidu JMR TV ANDHRA PRADESH.

jmrtvlive