జగన్‌_టీమ్‌25లోని_మంత్రుల_ప్రొఫైల్‌..!!!

#జగన్‌_టీమ్‌లోని_మంత్రుల_ప్రొఫైల్‌.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 25 మంది మంత్రులతో ఏపీ కేబినెట్‌ను శనివారం ఏర్పాటు చేశారు. తన మంత్రి మండలి కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయానికి అగ్రప్రాధాన్యం కల్పించారు. దాదాపు 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించడం ద్వారా ఆయన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మంత్రి…

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి!!!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన 25 మందికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాఖలు కేటాయించారు. దీనికి గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదముద్ర వేశారు. ఐదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆళ్ల నాని, అంజాద్‌ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పుష్పశ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్‌ పేజీలోనూ ఈ వివరాలు…

సీఎం జగన్‌ తొలి సంతకం…!! మూడు ఫైళ్లపై సీఎం జగన్‌ సంతకాలు!!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం సచివాలయానికి చేరుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన సచివాలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. వేదపండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి.. ఉదయం 8.39 గంటలకు తన ఛాంబర్‌లో సీఎం అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన తన చాంబర్‌లోని కుర్చీపై ఆసీనులయ్యారు. మూడు ఫైళ్లపై సీఎం జగన్‌ సంతకాలు సచివాలయంలోకి అడుగుపెట్టి.. ముఖ్యమంత్రిగా బాధ్యతల…

సామాజిక, రాజకీయ విప్లవం..!!! విజయవాడ లో తెలుగు రాష్ట్రా గవర్నర్ నరసింహన్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజకీయ, సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తరతరాల రాజకీయ వివక్షకు తెరదించేస్తూ బడుగు, బలహీనవర్గాలకు తన మంత్రివర్గంలో అగ్ర ప్రాధాన్యం కల్పించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తున్నట్లు ప్రకటించి రాజకీయ సంచలనం సృష్టించారు. తన మంత్రి మండలి ఏర్పాటులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు…

శ్రీ సూర్యనారాయణా.. మేలుకో.. మేలుకో..!!!

అవును.. మన సూర్యుడు నిద్దరోతున్నాడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదహారు రోజులుగా నిద్రలోనే జోగుతున్నాడు.. ఈ నిద్ర అయస్కాంత తుపానులకు దారితీయొచ్చు.. ఉపగ్రహాల పనితీరు దెబ్బతినేందుకు కారణం కావొచ్చు!అదే జరిగితే.. ఇంటర్నెట్‌ కట్‌! విమాన ప్రయాణాలు బంద్‌! ముందు సూర్యుడు నిద్రపోవడం అంటే ఏంటో తెలుసుకుందాం. సన్‌స్పాట్స్‌ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? సూర్యుడిపై నిత్యం పెద్ద ఎత్తున పేలుళ్లు జరుగుతుంటాయి. వీటి కారణంగా ఆయా ప్రాంతాల్లో…

రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక…!!!

అమరావతి : సాధారణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునేందుకు ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల సందర్శనపై ఆసక్తి చూపుతూ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి కేరళలోని…

పార్టీ, ప్రభుత్వం మనకు రెండు కళ్లు….!!!

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏలూరు ‘బీసీ గర్జన’ సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అనుసరించి తొలి అడుగుగా మంత్రివర్గంలో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందు ఒక రోజు ముందు అసాధారణ రీతిలో నిర్వహించిన వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి…

సీఎం వైఎస్‌ జగన్‌ షెడ్యూల్‌ ఇలా… సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి….!!!

అమరావతి :ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. చివాలయంలోని తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశం కానున్నారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్‌…

చంద్రబాబుకు శివసేన చురకలు…!!!

ముంబై: కేంద్రంలో విపక్షాలను ఏకం చేసి, ఎన్డీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను శివసేన ఎద్దేవా చేసింది. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికే సమాధానం లభించిందని తమ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో శివసేన పేర్కొంది. ‘ప్రధాని పదవికి ప్రతిపక్షంలో కనీసం ఐదుగురు పోటీదారులు ఉన్నారు. కానీ వీరి కలలు కల్లలయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కేంద్రంలో…

ఆంధ్ర ప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌!!!

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోని రాబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీ అధిక స్థానాలు గెలుచుకుటుందని జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ తేట తెల్లం చేశాయి. వైఎస్సార్‌సీపీకి గరిష్టంగా 24 ఎంపీ సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని అత్యధిక శాతం ప్రజలు కోరుకుంటున్నారు….